గుంటూరు జిల్లా తాడేపల్లిలో అరుదైన పిల్లి జాతి జంతువు ప్రత్యక్షమైంది. తాడేపల్లి కొండపై నుంచి ముగ్గురోడ్డులోని గొట్టిముక్కల లాజర్ ఇంట్లోకి ప్రవేశించిన ఈ పిల్లిని చూసిన స్థానికులు తొలుత భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం దానిని చాకచక్యంగా బంధించి ఆటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.