Home Minister Anitha on Crimes : నేరం చేసిన వారికి వంద రోజుల్లో శిక్షపడేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని హోం మంత్రి అనిత తెలిపారు. నేరస్థులకు 100 రోజుల్లో శిక్ష పడేలా పోలీసు యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని చెప్పారు. ప్రస్తుతం కొత్తగా 394 ఎస్సైలు విధులు చేపట్టగా, మరి కొద్దిరోజుల్లో ఆరువేల మంది పోలీసు కానిస్టేబుళ్ల నియామకం పూర్తి కానుందన్నారు. అనంతపురం పోలీస్ శిక్షణ కేంద్రంలో సబ్ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Category
🗞
News