• 7 years ago
fter one year of Jayalalithaa's issue, a Bangalore-based woman Amrutha has claimed that she was born to the late Tamil Nadu Chief Minister. And she petitioned the Supreme Court calling for a DNA test after exhuming Jayalalithaa’s body from its resting place.

అలనాటి సినీ నటి, తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలతి కూతురు అమృత వ్యవహారం ఆసక్తిగా మారింది. తాను జయలలిత కూతురునని ఆమె బలంగా చెప్పుతుండటంతో మీడియాలో అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. బెంగళూరుకు చెందిన అమృత వెల్లడిస్తున్న విషయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఇటీవల అమృత మీడియాకు వెల్లడించిన విషయాలు మరింత వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి.
జయలలిత కుమార్తెననే వాస్తవం ఇటీవలే నాకు తెలిసింది. ఈ విషయాన్నిపూర్తిగా ధ్రువీకరించుకున్న తర్వాతే పిటిషన్ దాఖలు చేశాను. నా పెంపుడు తండ్రి మరణానికి ముందు తాను జయలలిత కుమార్తెను అని ఆయన చెప్పడంతో అసలు విషయం బయటపడింది.
జయలలిత కుమార్తె అనే విషయంపై తొలుత నాకే అనేక అనుమానాలు తలెత్తాయి. నా బంధువులు, సన్నిహితులు చెప్పిన విషయాలతో తాను జయలలిత కుమార్తెను అనే విషయం స్పష్టం అయింది. అన్ని విషయాలు విచారించుకొన్న తర్వాతే ఈ విషయాన్ని బహిర్గతం చేశాను అని అమృత వెల్లడింది.

Recommended