Home Minister Anitha on Disha APP : మహిళలకు భద్రత కల్పించేందుకు దిశ యాప్ స్థానంలో కొత్తగా శక్తి యాప్ తీసుకొస్తున్నట్లు హోం మంత్రి అనిత ప్రకటించారు. ఈ నెల 8న మహిళా దినోత్సవం రోజున దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. మహిళలపై లైంగిక వేధింపులు, దిశ చట్టంపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పలు ఆరోపణలు చేశారు. దిశ యాప్ను కొనసాగించకపోవడం వల్ల స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఈ యాప్ను కొనసాగించాలని కోరారు. దీనిపై స్పందించిన హోం మంత్రి ధీటుగా సమాధానం ఇచ్చారు.
Category
🗞
News