• 7 years ago
Hollywood was rocked by allegations against Harvey Weinstein. Salma Hayek has now come forward with her "painful episode" courtesy the disgraced producer. She revealed she was extremely excited to work with him, but her happiness soon turned into a nightmare. She spent the next few months turning down his unwanted advances.

హాలీవుడ్ దర్శకుడు తనను లైంగికంగా దారుణంగా వేధించాడని అందాల తార సల్మా హయక్ సంచలన ప్రకటన చేసింది. తనతో అనుచితంగా ప్రవర్తించాడని, ఓ దశలో తనను చంపుతానని ఆయన బెదిరించాడని సల్మా దర్శకుడి బాగోతాన్ని బయటపెట్టింది. అలాంటి కీచక దర్శకుడు ఎవరో కాదు హర్వీ వెయిన్‌స్టెయిన్. ఇప్పటికే ఆయనపై ఎందరో హాలీవుడ్ హీరోయిన్లు తమను వేధించాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సల్మా బయటపెట్టిన విషయాలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి.
ప్రముఖ హాలీవుడ్ నటి సల్మా హయక్ ఇటీవల న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఓ వ్యాసం రాశారు. తన కెరీర్ తొలి నాళ్లలో హర్వీ ఎలా వేధించుకు తిన్నాడో వివరంగా, పూసగుచ్చినట్టుగా వెల్లడించింది.
2002లో ఫ్రైడా అనే చిత్రం కోసం హార్వేతో సల్మా హయక్ పనిచేసింది.ఆ చిత్రంలో సల్మా నటించడమే కాకుండా, సహ నిర్మాతగా వ్యవహరించారు.
హర్వే వెయిన్‌స్టెయిన్‌ ప్రవర్తన ఎంత దారుణమంటే.. ఎప్పుడూ శారీరక సుఖం కోసం వేధించేవాడు. హోటల్, షూటింగ్ లొకేషన్, ఎక్కడ ఉన్నామనే ధ్యాస ఉండకుండా వేధించేవాడు.అతని దారుణాలు ఎలా ఉండేవంటే.. తనతో స్నానం చేయమని బలవంతం పెట్టేవాడు. లేదా నేను స్నానం చేస్తుంటే చూస్తానని వేధించేవాడు అని తన వ్యాసంలో వెల్లడించింది.
ఇక నగ్నంగా మసాజ్ చేస్తానని, లేదా తన స్నేహితుడితో మసాజ్ చేయించుకోమని పోరుపెట్టేవాడు. ఓరల్ సెక్స్ చేయమని బలవంతం చేసేవాడు. నగ్నంగా ఉన్న మరో మహిళతో పడుకోమనే వాడు అని సల్మా హయక్ పేర్కొన్నది. ఓ దశలో నన్ను చంపుతానని బెదిరించాడు.

Recommended