• 7 years ago
I think there are Harvey Weinsteins in Bollywood also, but there is probably an equal number of Harvey Weinsteins on the other side of the story, but people do not want to talk about that part. says Ekta Kapoor

సినిమా ఇండస్ట్రీ అంటేనే మనకు ఓ వైపు వినోదం... మరో వైపు కొన్ని చీకటి కోణాలు కనిపిస్తుంటాయి. ఆ చీకటి కోణాల్లో కాస్టింగ్ కౌచ్, సెక్సువల్ హెరాస్మెంట్ లాంటివి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ కాస్టింగ్ కౌచ్, సెక్స్ స్కాండల్స్ గురించి సంచలన విషయాలు బయట పెట్టారు. ప్రముఖ పాత్రికేయురాలు నిర్వహిస్తున్న 'ది టౌన్ హాల్' అనే కార్యక్రమంలో పాల్గొన్న ఏక్తా కపూర్ ఇక్కడ చర్చలో హార్వీ వెయిన్‌స్టన్ ప్రస్తావన రాగా ఆసక్తికరంగా స్పందించారు.
హాలీవుడ్లో హీరోయిన్లను సెక్సువల్ హరాస్మెంట్ చేసిన హార్వీ వెయిన్‌స్టన్ లాంటి నిర్మాతలు బాలీవుడ్లోనూ ఉన్నారు. అదే సమయంలో ఇక్కడ తమ సెక్సువాలిటీని వాడుకుని అవకాశాలు దక్కించుకునే యాక్టర్లు కూడా ఉన్నారు అంటూ ఏక్తా కపూర్ వ్యాఖ్యానించారు.
హార్వీ వెయిన్‌స్టన్ వ్యవహారం తర్వాత ఎక్కడి చూసినా నిర్మాతలు ఇలా చేస్తున్నారు....... అంటూ చర్చ జరుగుతోంది. యాక్టర్లను నిర్మాతలు సెక్స్ కోసం వాడుకుంటున్నారు అంటున్నారు. అది నిజమే. కానీ ఇది ఒక కోణం మాత్రమే. అవకాశాల కోసం, తమ పనులు చక్క దిద్దుకోవడం కోసం సెక్స్ ఆఫర్ చేస్తున్న యాక్టర్లు కూడా ఉన్నారు.... అని ఏక్తా కపూర్ తెలిపారు.
మన సినిమా ఇండస్ట్రీలో కొందరు యాక్టర్లు అర్దరాత్రి దాటిన తర్వాత నిర్మాతను వెళ్లి కలుస్తారు, అతడితో గడుపుతారు. మీతో రాత్రి గడిపాం కాబట్టి తమకు అవకాశం కావాలని అడిగితే నిర్మాత దానికి ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను అతడు సపరేటుగా చూడొచ్చు. మరి ఇక్కడ విక్టిమ్ ఎవరు? అని ఏక్తాకపూర్ ప్రశ్నించారు.

Recommended