Skip to playerSkip to main contentSkip to footer
  • 11/16/2017
She was told that coming out as bisexual would destroy her film career, but Amber Heard defied those who warned her against it.

తన గురించి ఓ మేగజైన్‌లో వచ్చిన కథనంతో తన జీవితం తలకిందులైందనట్లు అనిపించిందని హాలీవుడ్ నటి అంబర్ హియర్డ్ అన్నారు.ఈ నెల 16న విడుదల కానున్న తన 'జస్టిస్ లీగ్' సినిమా ప్రమోషన్ లో ఆమె మాట్లాడుతూ, తనపై బై సెక్సువల్ అని ఆ మేగజీన్ లో కవర్ స్టోరీ రావడంతో విషయం అందరికీ తెలిసిపోయిందని చెప్పింది.
అలా కవర్ స్టోరీ రావటంతో జీవన విధానాన్ని అలాగే ఇంకా కొనసాగిస్తే మరిన్ని చిక్కులు తప్పవని ఇండస్ట్రీ ప్రముఖులు హెచ్చరించారని ఆమె తెలిపింది. లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్ జెండర్ (ఎల్జీబీటీ) వర్గాలపై చిన్నచూపుందని ఆమె వాపోయింది. అప్పటినుంచి తన సినీ కెరీర్ నాశనమైందన్నారు.
.తాను జానీ డెప్, నికోలస్ కేజ్ వంటి స్టార్స్ తో నటించానని, ఆ సమయంలో ఎలా ఉండేదానినో వారినడిగి తెలుసుకోవాలని ఆమె సూచించింది.
కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎంత అభివృద్ధి చెందుతున్నా, సరికొత్త ఆవిష్కరణలు వస్తున్నా..కొన్ని విషయాల్లో ఎంత వెనుకబడి ఉన్నామో చెప్పేందుకు ఎల్జీబీటీలపై ఉన్న వివక్షే నిదర్శనమని ఆమె తెలిపింది.

Recommended