Stephen Hawking, an award-winning physicist and influential author lost life early Wednesday morning at age of 76. He was a great scientist and an extraordinary man whose work and legacy will live on for many years
ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌ను ప్రపంచం కోల్పోయింది. ఆయనకు 76 ఏళ్లు. ఆయన మృతిని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. బ్లాక్ హోల్స్‌పై చేసిన ఆయన విశేష పరిశోధనలు ఖగోళ శాస్త్ర పరిశోధనల్లో విప్లవాత్మకమైనవి. తమ ప్రియమైన తండ్రిని కోల్పోవడంతో విషాదంలో మునిగిపోయామని పిల్లలు లూసీ, రాబర్ట్, టిమ్ చెప్పారు. ఆయన మహా వ్యక్తి మాత్రమే కాకుండా గొప్ప శాస్త్రవేత్త కూడా. చక్రాల కుర్చీకే అతుక్కుపోయి కదలలేని స్థితిలో ఉండి కూడా మొక్కవోని ఆత్మస్థైర్యంతో పరిశోధనలు సాగించారు.
మాట్లాడలేని స్థితిలో కూడా ఆయన కంప్యూటర్ సహాయంతో ఖగోళ పరిశోధనలు చేశారు.ఆయన పరిశోధనలు ఖగోళానికి చెందిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాయి. 1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్‌ఫర్డ్‌లో ఆయన జన్మించారు. ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పనిచేసిన ఆయనకు వ్యాధి ఆటంకంగా కాలేదు. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా కూడా మెదడు సహకరిస్తుండడాన్ని ఆయన పసిగట్టారు. ఆయన 1970 నుంచి బ్లాక్ హోల్స్ (కృష్ణ బిలాలు)ై పరిశోధనలు ప్రారంభించారు. తనకు వ్యాధి ఉందనే విషయాన్ని కూడా ఆయన తన పరిశోధనల్లో మునిగిపోయి మరిచిపోయారు. క్వాంటమ్ థియరీ, జనరల్ రిలెటివిటీలను ఉపయోగించి ఆయన బ్లాక్ హోల్స్ కూడా రేడియేషన్‌ను వెలువరిస్తాయని కనిపెట్టారు.
ఐన్‌స్టీన్ తర్వాత అంతటి ఫిజిస్టుగా ఆయన పేరు గడించారు.ఆయన రాసిన బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టై్ అనే పుస్తకం రికార్డులు బద్దలు కొట్టి 237 వారాల పాటు బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. స్టీఫెన్ హాకింగ్ గొప్ప శాస్త్రవేత్త, అసాధారణమైన వ్యక్తి అని పిల్లలు తమ ప్రకటనలో అన్నారు. ఆయన కృషి, వారసత్వం ఏళ్ల తరబడి మనుగడలో ఉంటాయని అన్నారు. తెలివి, హాస్యప్రియత్వాలతో కూడిన ఆయన ధైర్యం, పట్టుదల ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. ప్రజలకు నివాసయోగ్యం కాకపోయినట్లయితే విశ్వానికి అర్థం లేదని స్టీఫెన్ హాకింగ్ చెప్పిన మాటలను వారు గుర్తు చేశారు. శాశ్వతంగా ఆయనను తాము కోల్పోయామని చెప్పారు.

Category
🗞
News