Warangal Urban district collector Amrapali Marriage photos are going viral in social media. She got marriage with 2011 batch IPS officer Sameer Sharma.
వరంగల్ జిల్లా అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి కాటా వివాహం జమ్ము కాశ్మీర్‌లోని ఆర్కే రెసిడెన్సీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ పెళ్లికి వరంగల్ జిల్లా నుంచి కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఆమ్రపాలి ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను పెళ్లి చేసుకున్నారు. జిల్లా నుంచి పెళ్లికి హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు కొత్త దంపతులను ఆశీర్వదించారు. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
ఆమ్రపాలి పెళ్లికి ఇరు కుటుంబాల వారు, బంధువులు, స్నేహితులతో పాటు వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ శ్రృతి ఓజా, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తక్కెళ్లపల్లి రవీంద్రరావు, వరంగల్ అర్బన్ కలెక్టర్ సిబ్బంది, మరికొంతమంది ముఖ్యులు హాజరయ్యారు.
సమీర్ శర్మ బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి బరాత్‌తో కళ్యాణ మండపానికి చేరుకున్నారు. పెళ్లికి సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి. సాయంత్రం ఇరువురు ఉంగరాలు మార్చుుకున్నారు. ఆమ్రపాలిని సంప్రదాయ పద్ధతిలో పెళ్లి కూతురుగా అందంగా ముస్తాబు చేశారు.

Category
🗞
News