• 6 years ago
Mahanati Savitri Daughter Vijaya Chamundeswari Real Behaviour Revealed by Relative. Savitri was an Indian film actress, playback singer, dancer, director and producer.

మహానటి' విడుదలైనప్పటి నుండి విజయ చాముండేశ్వరి ప్రవర్తన, కామెంట్స్ చూస్తున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని విషయాలు చెప్పాలనిపించింది. అమ్మ మీద ప్రేమ చూపించడంలో తప్పు లేదు. పైగా సావిత్రి గ్రేట్ మదర్. కానీ సావిత్రి చివరి రోజుల్లో విజయ చాముండేశ్వరి ఎలా ప్రవర్తించిందో అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది.... అంటూ చౌదరి మనవరాలు విడుదల చేసిన ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సావిత్రి బ్రతికి ఉన్నపుడు విజయ చాముండేశ్వరి, ఆమె హస్బెండ్, వాళ్ల బంధువులు..... సావిత్రి ఇంటి కోసం ఆమెపై కోర్టు కేసులు వేసి, ఇంటి నుండి తరిమేశారు. సావిత్రి అపుడు అన్నానగర్‌లో కొడుకు సతీష్‌తో అద్దింట్లో ఉన్నారు. విజయ, ఆమె భర్త, బంధువులు సావిత్రి సొంత ఇంట్లో ఉన్నారు. మీ అమ్మ బ్రతికి ఉన్నపుడు నువ్వు ఇదంతా చేసి ఇపుడు ప్రజల ముందు అమ్మ గురించి తలుచుకుంటూ ఎమోషనల్‌గా మాట్లాడుతున్నావు. ఇది చూసి కాస్త బాధేసింది....
inka మీ అమ్మకు చిన్నప్పటి నుండి కష్టాలే. వాళ్ల నాన్న పోవడం, ఎవరో పెంచుకోవడం, చిన్న వయసులో సినిమాల్లో చేర్పించడం.. ఇప్పటికీ కూడా మీరు సినిమా తీసి అమ్మ లైఫ్ ను సెలబ్రేషన్ లా చూపించాం, ట్రాజిడీగా చూపించడం మాకు ఇష్టం లేదు అని అంటున్నారు. నిజం ఏమిటంటే ఆమెది చాలా ట్రాజెడీ లైఫ్. ఆమెకు చెడు చేసిన చాలా మంది చుట్టాలు ఉన్నారు. ఆమె సిస్టర్ కానీ, సిస్టర్ హస్బెండ్ కానీ... దే ఆర్ ఔటాఫ్ ది పిక్చర్.

Recommended