• 6 years ago
A Man arrested for filming private photos of a house wife in Hyderabad.

రిపేర్ చేయడానికని ఇంటికి వచ్చిన ఓ మెకానిక్ గృహిణణిపై మత్తుమందు చల్లి అత్యాచారం చేశాడు. ఆమెను నగ్నంగా సెల్‌ఫోన్‌లో చిత్రించి, వాటిని చూపిస్తూ బెదిరింపులకు పాల్పడి పదే పదే ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. అతని బెదిరింపులకు, చర్యలకు విసిగిపోయిన బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాదులోని బాచుపల్ల పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ప్రగతినగర్‌కు చెందిన ఓ గృహిణి వాషింగ్ మిషన్ ఐదు నెలల క్రితం పాడైంది. దాంతో ఇంటర్నెట్‌లో గాలించి మియాపూర్‌లోని ఓ సర్వీసు సెంటర్‌కు ఫోన్ చేసింది. యజమానికి బదులు పవన్ తేజ్ రెడ్డి (24) ఫోన్‌లో మాట్లాడాడు.
ఆమె చెప్పిన అడ్రస్‌తో ఆమె ఇంటికి వెళ్లి నాలుగైదు రోజులు ఏమీ చేయకుండా కాలం వెళ్లదీస్తూ వచ్చాడు. మిషన్ బాగు చేసేందుకు అవసమైన వస్తువులను తెప్పించాలని చెప్పి వారం తర్వాత తిరిగి వచ్చాడు.
ఇంట్లో ఒంటరిగా ఆమెపై మత్తుమందు చల్లాడు. స్పృహ కోల్పోయిన ఆమెను వివస్త్రను చేశాడు. సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీశాడు. ఆ తర్వాత వాటిని చూపింంచి ఆమెపై అత్యాచారం చేశాడు.

Category

🗞
News

Recommended