Skip to playerSkip to main contentSkip to footer
  • 12/21/2017
Former Telecom Minister A. Raja has been acquitted in the 2G spectrum case, along with all other accused, including Rajya Sabha MP Kanimozhi.

యూపీఏ హయాంలో జరిగిన అతి పెద్ద కుంభకోణంగా 2జీ స్కాంను చెబుతారు. సంచలనం సృష్టించిన ఈ స్కాంలో టెలికం శాఖ మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపి కనిమొళి ని పాటియాలా కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు పాటియాలా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. యూపీఏ హయాంలో ఈ కుంభకోణం చోటు చేసుకుంది. ఆ సమయంలో డీఎంకేకు చెందిన ఎ రాజా టెలికాం శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన నేతృత్వంలో జరిగిన 2జీ స్పెక్ట్రం కేటాయింపులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాగ్ ఆరోపించింది.
ఈ అవినీతి వల్ల ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని నాడు వినోద్ రాయ్ నేతృత్వంలోని కాగ్ పేర్కొంది. కాగ్ ఆరోపణలు చేయడంతో 2010లో రాజాను నాటి ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ దర్యాఫ్తు చేపట్టింది. రాజా, కనిమొళి సహా 17 మంది నేతలు, కార్పోరేట్ సంస్థల అధికారులపై ఛార్జీషీట్ దాఖలు చేశారు.

Category

🗞
News

Recommended