A special Central Bureau of Investigation (CBI) court will on January 4 pronounce the quantum of sentence for former Bihar chief minister Lalu Prasad who has been convicted in a fodder scam case.
పశు దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు న్యాయస్థానం శిక్షను గురువారం ఖరారు చేయనుంది. ఆయనకు ఎన్నేళ్లు శిక్ష పడనుందో ఖరారు కానుంది. బుధవారమే ఖరారు కావాల్సింది. కానీ ఒక రోజు వాయిదా పడింది. న్యాయవాది విందేశ్వరి ప్రసాద్ మృతిచెందడంతో తీర్పును రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు, దాణా కుంభకోణం కేసులో దోషి బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని బిర్సాముండా కారాగారం నుంచి రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి చేరుకున్నారు.
డిసెంబరు 23న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూతో పాటు మరో 15 మందిని దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. వీరికి శిక్ష ఖరారు చేయాల్సి ఉన్న నేపథ్యంలో లాలూ ప్రత్యేక పోలీసు భద్రత మధ్య కోర్టుకు వచ్చారు. 1991-94 మధ్య దేవ్‌గఢ్ ఖజానా నుంచి రూ.89.27లక్షల మొత్తాన్ని తప్పుడు వివరాలతో కాజేయడానికి సంబంధించిన కేసులో రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు గత నెల 23న లాలూని దోషిగా తేల్చింది.

Category
🗞
News