• 7 years ago
After Sujoy Ghosh resigned as the head of the jury of IFFI’s Panorama section to protest exclusion of the two films, two more members have quit. Apoorva Asrani says his conscience “won’t allow” him to participate in the festivities in Goa.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ప్రదర్శించే చిత్రాల నుంచి మలయాళ చిత్రం ఎస్ దుర్గ, మరాఠీ చిత్రం న్యూడ్‌ను తొలగించడంపై జ్యూరీ సభ్యులు భగ్గుమంటున్నారు. తాము ఎంపిక చేసిన చిత్రాలను కేంద్ర సమాచారశాఖ తొలగించడాన్ని నిరసిస్తూ జ్యూరీ సభ్యులు సుజోయ్ ఘోష్, గ్యాన్ కొర్రియా, అపూర్వ అస్రానీ తమ పదవులకు రాజీనామా చేశారు. నవంబర్ 20 తేదీ నుంచి 28వ తేదీ వరకు గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ దుర్గ, న్యూడ్ చిత్రాలను తొలగించడంపై జ్యూరీ సభ్యులు ఈ విధంగా స్పందించారు.
ఇఫీలో మంచి చిత్రాలను ప్రదర్శించాలన్న లక్ష్యంతో తాము కొన్ని సినిమాలను ఎంపిక చేశాం. అయితే వాటిలో నుంచి కొన్నింటిని తొలగించడం మాకు ఇబ్బందికరంగా మారింది. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా మేము అంకితభావంతో సినిమాలను ఎంపిక చేశాం అని అస్రానీ అన్నారు.
ఎస్ దుర్గ, న్యూడ్ చిత్రాలను ఇఫీ నుంచి తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తూ రాజీనామా చేసిన జ్యూరీ చైర్మన్ సుజోయ్ ఘోష్ స్పందించారు. తాము ఎంపిక చేసిన చిత్రాలను తొలగించింది నిజమే. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడి దీనిని వివాదం చేయదలచుకోలేదు అని ఆయన అన్నారు.

Recommended