• 6 years ago
Senior actress Kushboo attended court in Chennai. Kushboo gets harmed by some people years back. This case is going on in court.She spoke about boy and girl relation before marriage in past days.

80 వ దశకంలో పలువురు దక్షణాది అగ్రహీరోయిన్లకు వలే ఖుష్బూ కూడా యువతకు కలల హీరోయిన్. టాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది. కాగా సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది.
కాగా ఖుష్బూపై తమిళనాడులో 2005 లో ఓ కేసు నమోదలైంది. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ కేసు నమోదు చేసారు. ఇప్పటికి ఆ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె కోర్టులో హాజరయ్యారు.
ప్రస్తుతం పలువురు ప్రముఖులు స్త్రీల స్వేచ్ఛ గురించి భిన్న కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. 2005 లోనే ఖుష్బూ దీని గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆడా, మగా ఇష్టంతో పెళ్ళికి ముందు సెక్స్ లో పాల్గొంటే తప్పులేదు. అంత మాత్రాన ఆడవారి శీలం పోదు. శీలం అనేది మనసుకు సంభందించినది అని ఖుష్బూ 2005 లో ఓ ఇంటర్వ్యూ లో అన్నారు.
ఖుష్బూ వ్యాఖ్యలతో అప్పట్లో పెనువివాదమే రేగింది. ఖుష్బూ ప్రయాణిస్తున్న వాహనంపై కోడిగుడ్లు, టమోటాలతో దాడిచేశారు. ఈ చర్యల్ని ఖండిస్తూ ఖుష్బూ కేసు నమోదు చేసారు. ఈ దాడిలో భాగంగా మొత్తం 41 మందిపై కేసు నమోదైంది.
ఈ కేసులో భాగంగా ఖుష్బూ బుధవారం కోర్టు ముందు హాజరయ్యారు. అయితే ఖుష్బూ కూడా హాజరు కావాలని కోర్టు ఇటీవల నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

Recommended