Skip to playerSkip to main contentSkip to footer
  • 12/8/2017
Prince Mahesh Babu in Mumbai town Now. He was spotted at Mumbai airport with his wife Namrata Shirodkar. Namrata has come down to Mumbai, with her hubby, for a visit to her family.

దక్షిణాది అగ్ర హీరోలంతా ఈ మధ్యకాలంలో ముంబైలో హడావిడి చేస్తున్నారు. సాహో చిత్రం కోసం ప్రభాస్, కాలా చిత్రం కోసం రజనీకాంత్‌ ముంబైను అడ్డాగా చేసుకోవడం తెలిసిందే. ఇక విక్టరీ వెంకటేష్ కూడా ఏదో పనిమీద సల్మాన్‌తో భేటి కావడం, సల్మాన్ గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ముంబైలో కనిపించిన మీడియాలో కొద్దిరోజుల క్రితం మీడియాలో వైరల్‌గా మారింది.
తాజాగా ప్రిన్స్ మహేశ్‌బాబు తన భార్య నమ్రతాతో కలిసి ముంబైలో దర్శనమిచ్చాడు. ముంబైలో ప్రిన్స్ అడుగుపెట్టడం కొత్తేమీ కాదు. ఎందుకంటే ముంబై మహేశ్‌కు అత్తారిల్లు లాంటింది.ఎందుకంటె నమ్రత మహారాష్ట్రకు చెందిన వారే. బాలీవుడ్‌లోనే తన కెరీర్‌ను ప్రారంభించారు కూడా. ఆ తర్వాతే టాలీవుడ్‌కు పరిచయమైంది.
టాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూనే ఘట్టమనేని ఇంటికి కోడలు అయింది. అప్పటి నుంచి అడపాదడపా ముంబైకి వెళ్లి రావడం జరుగుతుంది. తాజాగా మళ్లీ మహేశ్‌తో కలిసి ముంబైలో కనిపించడం మీడియా కంటపడింది. దాంతో ఎందుకు ముంబైకి వెళ్లారు అనేది ప్రశ్నగా మారింది.

Recommended