నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో స్పిన్నర్ యజువేంద్ర చాహల్ హ్యాట్రిక్ తో మెరిసిపోయాడు. సీజన్ లో ఇప్పటివరకూ అంతంత మాత్రం ప్రదర్శనతో సరిపెడుతూ వస్తున్న చాహల్..నిన్న చెన్నై పై మాత్రం రెచ్చిపోయాడు. మొదటి రెండు ఓవర్లు బౌలింగ్ పక్కనపెడితే..పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ధోనీ క్రీజులో ఉన్నాడని తెలిసి కూడా బాల్ ని తీసుకెళ్లి అది కూడా 19 ఓవర్ ను చాహల్ చేతిలో పెట్టాడు. కానీ ధోనీ మొదటి బంతికే చాహల్ ను భారీ సిక్సర్ బాదాడు. ఇక చాహల్ ధోని చేతిలో చచ్చాడే అని ఫ్యాన్స్ అంతా భావించి ఉంటారు. కానీ తనే ఐపీఎల్ లో లీడింగ్ వికెట్ టేకర్ అని అందరికీ గుర్తు చేసేలా నెక్ట్స్ బంతికే ధోనిని దొరకబుచ్చుకున్నాడు. మరోసారి ఫ్లైటైడ్ డెలెబ్రీ వేస్తే టెంప్ట్ అయిన ధోని లాంగాఫ్ లో క్యాచ్ ఇచ్చి అవుటైపోయాడు. ఇక అది మొదలు మిగిలిన పనిని చాహల్ ఫినిష్ చేసేశాడు. 172 పరుగులకే 4 వికెట్లు మాత్రమే పడిన చెన్నైని 190 పరుగులకు ఆలౌట్ అయిపోయేలా చేశాడు. ఆఖరి 9 బంతుల్లో చెన్నై 5వికెట్లు కోల్పోయేలా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు చాహల్. శామ్ కర్రన్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు 200 ఈజీగా దాటేసేలా కనిపించిన చెన్నైను గల్లంతు చేసి పారేస్తూ...19వ ఓవర్ నాలుగు ఐధు ఆరు బంతులకు వరుసగా దీపక్ హుడా, అన్షుల్ కాంభోజ్, నూర్ అహ్మద్ లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు చాహల్. చాహల్ దాటికి ఆ ఓవర్లోనే నాలుగు వికెట్లు పడ్డాయి. ఐపీఎల్ కెరీర్ లో చాహల్ కి ఇది రెండో హ్యాట్రిక్ కాగా...రెండేసి హ్యాట్రిక్ లు తీసిన రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ ల సరసన చేరాడు చాహల్. అమిత్ మిశ్రా మూడు హ్యాట్రిక్ లతో టేబుల్ లో టాప్ లో ఉన్నాడు. మొత్తంగా 3 ఓవర్లలో 32 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసిన చాహల్ చెన్నైని 190పరుగులకే పరిమితం చేయటంతో పాటు ఓవరాల్ గా తన 218వ ఐపీఎల్ వికెట్ తీసుకుని తనెందుకు ఐపీఎల్ లో టాప్ అండ్ లీడింగ్ వికెట్ టేకర్ ను ప్రూవ్ చేశాడు.
Category
🗞
News