Anna Lezhneva visits Tirumala Tirupati Devasthanam : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారు జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని, స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత అన్నా లెజినోవా అఖిలాండం వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.
Category
🗞
NewsTranscript
00:00What