Skip to playerSkip to main contentSkip to footer
  • 3/27/2025
Devadula Lift Irrigation Scheme : దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా హనుమకొండ జిల్లా దేవన్నపేటలో నిర్మించిన పంప్ హౌస్ మోటర్లు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. పది రోజులపాటు ఇంజినీర్లు, అధికారులు శ్రమించి మోటార్లను ప్రారంభించి ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. దీంతో దేవన్నపేట నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ వరకు గోదావరి జలాలు వడివడిగా చేరుకుంటున్నాయి. దేవాదుల పంప్ హౌస్​ను ఇవాళ సాయంత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి సందర్శించి మోటార్లను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

వరంగల్ జిల్లా దేవన్నపేట వద్ద దేవాదుల ఎత్తిపోతల మూడోదశలో భాగంగా నిర్మించిన పంప్ హౌస్ మోటార్లలో ఏర్పడిన సాంకేతిక సమస్యను అధికారులు, ఇంజినీర్లు పరిష్కరించారు. సమస్యను పరిష్కరించి మోటార్లను ప్రారంభించారు. తెల్లవారుజాము సమయంలో మోటార్లు ప్రారంభంకాగా ధర్మసాగర్ రిజర్వాయర్​కు గంట వ్యవధిలో గోదావరి జిల్లాలు ధర్మ సాగర్ రిజర్వాయర్​కు చేరాయి. మోటార్లు ప్రారంభం కావడంతో అధికారులు ఇంజినీర్లు ఊపిరి పీల్చుకున్నారు.

పది రోజులుగా మోటార్లలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించి విజయవంతంగా ట్రయల్ రన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి తలమానికంగా మారిన దేవాదుల మూడోదశ ప్రారంభోత్సవాన్ని ఇవాళ సాయంత్రం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రారంభించనున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి దేవన్న పేటకు వచ్చి పంప్ హౌస్ మోటార్​ను ప్రారంభించనున్నారు.

Category

🗞
News

Recommended