• 3 days ago
Telangana Intermediate Exams Start From March Fifth : ఇంటర్మీడియట్ పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్న పరీక్షలకు మొదటి, రెండో సంవత్సరం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 244, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాల్లో 185, మేడ్చల్ లో 150 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. వారం రోజుల ముందే ప్రశ్నా పత్రాలు, ఓఎంఆర్, ఆన్సర్ షీట్లను జిల్లా కేంద్రాలకు పంపిన బోర్డు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమన్వయంతో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 8.45 నిమిషాల వరకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కోరిన ఇంటర్ బోర్డు 9 గంటల 5 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించనున్నట్టు పేర్కొంది.

Category

🗞
News

Recommended