రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మార్చి మూడో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
Category
🗞
News