8th DAY OF SRIVARI BRAHMOTSAVAM : శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఎస్ ఈ శ్రీ మనోహరం తదితరులు పాల్గొన్నారు.
Category
🗞
NewsTranscript
02:30you