• 7 years ago
Cinema actor Shivaji has called on political parties to take up an agitation like to stop trains to achieve AP special status. Story first published.
#andhrapradesh
#guntur
#cinemaactorsivaji
#politicalparties

"ప్రత్యేక హోదా కోసం పోరాటం అంటూ రాష్ట్రంలో బస్సులు ఆపటం కాదు...ధైర్యం ఉంటే రండి...రైల్వే ట్రాక్‌లపై కూర్చుందాం...కేంద్ర సంస్థల కార్యకలాపాలు ఆపుదాం"...అని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు సినీ నటుడు శివాజీ సవాలు విసిరారు.'మేధావుల మౌనం - సమాజానికి శాపం' అనే అంశంపై ఆదివారం గుంటూరు లో కమ్మజనసేవా సమితి బాలికల వసతిగృహ సముదాయంలో జరిగిన సమావేశంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వివిధ సంఘాలు, పార్టీల ప్రతినిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి గాను ఆంధ్రా ప్రజలు బిజెపిపై తమ ఆక్రోశం చూపబోతున్నారని, కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని సినీ నటుడు శివాజీ జోస్యం చేప్పారు.

Category

🗞
News

Recommended