• 7 years ago
The first 26 matches of the ongoing FIFA World Cup 2018 has garnered over 117 million viewers across 26 matches on TV and digital, official media rights partner Sony Pictures Networks India (SPNI) has claimed.
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సాకర్ అభిమానులు ఈ వరల్డ్ కప్‌ను తెగ ఆస్వాదిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులతో రష్యాలోని స్టేడియాలన్నీ మారుమోగిపోతున్నాయి.
ఈ వరల్డ్ కప్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గాను సుమారు 10 లక్షల మంది సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక, అక్కడి దాకా వెళ్లి చూసే అవకాశం లేనివాళ్లు వివిధ మార్గాల్లో మ్యాచ్‌లు చూస్తూ ఆనందిస్తున్నారు. గత వరల్డ్ కప్‌లతో పోలిస్తే ఈ వరల్డ్ కప్‌కు భారతదేశంలో కూడా భారీగా క్రేజ్ పెరిగింది.
టీవీ, ఆన్‌లైన్‌లో మ్యాచ్‌లు వీక్షించే అభిమానుల సంఖ్య భారత్‌లో గణనీయంగా పెరిగినట్లు బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌(బార్క్‌) తన నివేదికలో పేర్కొంది. మొదటి రెండు రోజులకే(నాలుగు మ్యాచ్‌లు) నిమిషానికి 4.7 కోట్ల మంది అభిమానులు వీక్షించినట్లు బార్క్‌ ఓ నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
#germany
#mexico
#worldcup2018
#footballworldcup
#russiaworldcup
#football

Category

🥇
Sports

Recommended