• 7 years ago
A larger number of unmarried, active women are now opting for safe relation. The National Family Health Survey 2015-16, conducted by the health ministry.

గత దశాబ్ద కాలంలో అవివాహిత మహిళల కండోమ్స్ వాడకం గణనీయంగా పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన 2015- 16 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో వెల్లడైంది. పెళ్లి కాకుండా లైంగిక క్రీడలో పాల్గొంటున్న మహిళలు సురక్షితమైన లైంగిక చర్యల కోం కండోమ్స్ వాడుతున్నట్లు సర్వేలో తేలింది. గత పదేళ్లలో 15 ఏళ్ల నుంచి 49 ఏల్ల వయస్సు గల మహిళలు పెళ్లి కాకుండా లైంగిక క్రీడలో పాల్గొంటున్నట్లు సర్వే స్పష్టం చేసింది.
గత పదేళ్ల కాలంలో 15 నుంచి 49 ఏళ్ల వయస్సు గల అవివాహిత మహిళలు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నవారి శాతం 2 నుంచి 12 శాతానికి పెరిగినట్లు సర్వేలో వెల్లడైంది. 20 నుంచి 24 ఏల్ల ధ్య వయస్సు గల పెళ్లి కాని మహిళలు ఎక్కువగా వాడుతున్నట్లు తేలింది.
ఎనిమిది మంది మహిళల్లో కనీసం ముగ్గురు గర్భస్రావం చేయించుకుంటున్నారని సర్వేలో తేలింది. 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సు గల వివాహితల్లో 99 శాతం మంది గర్భనివారణ చర్యలు పాటిస్తున్నట్లు తేలింది.
మహిళల్లో ఎక్కువ మంది ఇప్పటికీ సంప్రదాయ కుటుంబ నియంత్రణ పద్ధతలు పాటిస్తున్నట్లు సర్వే తేల్చింది. 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలు, పురుషుల్లో 54 శాతం మంది సంప్రదాయ పద్ధతులు వాడుతున్నట్లు తేలింది. కేవలం పది శాతం మందే ఆధునిక పద్ధతులు వాడుతున్నట్లు సర్వే తేల్చింది.

Category

🗞
News

Recommended