• 7 years ago
Andhra Pradesh Human Resources minister Ghanta Srinivas Rao warned BJP and reacted on Jana Sena chief Pawan Kalyan attitude

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అందించిన సాయంపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖపై రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా రాసిన లేఖపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సోమవారంనాడు అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు దేశ రాజకీయాలపై దృష్టి పెడితే ప్రకంపనలేనని ఆయన హెచ్చరించారు. హీరో శివాజీ లేవనెత్తిన అపరేష్ ద్రవిడ అంశంపై కూడా ఆయన స్పందించారు. రాజకీయాల్లో అనుభవం ముఖ్యమని అన్నారు.
చంద్రబాబు అనుభవం ముందు ఏ విధమైన ఆపరేషన్లు కూడా పనిచేయవని గంటా శ్రీనివాస రావు అన్నారు. టిడిపిని విమర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపై కూడా ఆయన మండిపడ్డారు పవన్ చర్యలు ఎవరికీ అర్థం కావని అన్నారు. అవన్నీ ఊహాతీతంగా ఉంటాయని అన్నారు.
విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా అమిత్ షా అలా లేఖ రాయడం ఆశ్చర్యకరంగా ఉందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అన్నారు. ఢిల్లీ కన్నా గొప్పగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మిస్తామని మోడీ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కేవలం రూ.2500 కోట్లతో ఢిల్లీ కన్నా గొప్ప రాజధని నిర్మించడం ఎలా సాధ్యమవుతుందని కేశినేని ప్రశ్నించారు. అమిత్ లేఖ, వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. హోదాతో కలిపి విభజన చట్టంలో 19 హామీలు ఉన్నాయని, వాటిలో 18 అంశాలు పెండింగులో ఉన్నాయని అవి పూర్తి చేయకుండా అన్నీ ఇచ్చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
ఈ రోజుల్లో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించాలంటేర.2500 కోట్లు ఖర్చవుతుందని, అటువంటిది రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని కేశినేని నాని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను వేటినీ అమలు చేయలేదని ఆయన అన్నారు.

Category

🗞
News

Recommended