• 7 years ago
A wild boar hist a Hyderabad-bound IndiGo aircraft that was carrying nearly 100 passengers and crew during take off at 10.30 pm on Sunday. Sources said that the wild boar appeared on the runway just as the aircraft was taking off. With no chance of avoid, the pilot continued the aborting take-off run.

ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి 10.30గంటల సమయంలో ఇండిగో విమానం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయలు దేరింది.
అయితే, విమానం టేకాఫ్ సమయంలో రన్‌వేపైకి దూసుకొచ్చిన అడవిపంది విమానం టైరును ఢీకొట్టింది. అప్పటికి విమానం టైర్లు ముడుచుకోకపోవడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సుమారు గంటపాటు విశాఖపట్నంలోనే ఆకాశంలో చక్కర్లు కొట్టించి ఆ తర్వాత సేఫ్‌గా ల్యాండ్ చేశాడు.
అనంతరం విమానానికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశారు. టైర్లలో చిక్కుకున్న పంది మాంసం ముద్దలను తొలగించి.. ప్రమాదం లేదని నిర్ధారించాక విమానం హైదరాబాద్ బయలుదేరింది.
విమానం సుమారు గంటపాటు విశాఖపట్నంలోనే గగనతలంపైనే తిరిగి తిరిగి మళ్లీ విశాఖ విమానాశ్రయంలోనే ల్యాండ్ కావడంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.

Category

🗞
News

Recommended