Skip to playerSkip to main contentSkip to footer
  • today
Saraswati Pushkaralu 2025 : కాళేశ్వర పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమం పుష్కర శోభతో అలరారుతోంది. తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పుష్కర స్నానాలు ఆరంభమయ్యాయి. నేటి నుంచి మొదలైన సరస్వతి పుష్కరాలు, ఈ నెల 26 వరకు సాగనున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర స్నానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సాయంత్రం కాళేశ్వరానికి వచ్చి పుష్కర వేడుకల్లో పాల్గొంటారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్తేత్రం కాళేశ్వరంలో పుష్కర సందడి మొదలైంది. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడంతో త్రివేణీ సంగమంగా పిలవబడుతుంది. 12 ఏళ్లకు ఒక నది వద్ద జరిగే పండుగే పుష్కరాలు. ఈసారి 12 రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కర సమయంలో ఆయా నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి శుభప్రదంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. దక్షిణాదిన సరస్వతీ పుష్కరాలు కాళేశ్వరంలోనే జరగడం విశేషం.

Category

🗞
News

Recommended