10th Class Toppers Flight Journey in AP : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఓ టీచర్ విమానం ఎక్కించారు. మండలస్థాయిలో మొదటి స్థానంలో నిలిచే విద్యార్థులను విమానంలో తీసుకెళ్తానని విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గోపన్నవలస ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు మరడాన సత్యారావు హామీ ఇచ్చారు. గత నెల 23న వచ్చిన ఫలితాల్లో గర్భాం, భైరిపురం పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎస్.వివేక్(593), టి.రేవంత్(591) అత్యధిక మార్కులు సాధించారు.
Category
🗞
News