Rains in AP Today : రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనికి తోడు భారీ ఈదురు గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో భారీ చెట్లు కుప్పకూలాయి. కోస్తా ఆంధ్రాలోని అల్లూరి, విశాఖ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గాలివానకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
Category
🗞
NewsTranscript
00:00It's a lot better than that.