Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
Nitya kalyanotsavam at Srikalahasti Temple : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా నిత్య కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ సోమ స్కంద మూర్తి సమేత జ్ఞాన ప్రసూనాంబికా దేవికి ప్రత్యేక అభిషేకాలు, హోమ పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆది దంపతుల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు దేవతామూర్తులను దర్శించుకున్నారు. అదేవిధంగా శ్రీ మృత్యుంజయ స్వామి అభిషేకాలను పెద్దసంఖ్యలో చేపట్టారు.మరోవైపు వాయులింగేశ్వరుడు కొలువుదీరిన శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తజన సంద్రంగా మారింది. వేసవి సెలవులు, అందులోనూ ఆదివారం, అమావాస్య కలిసి రావడంతో ఆలయంలో మహాశివరాత్రిని తలపించిన రీతిలో భక్తులు తరలివచ్చారు. ముక్కంటి ఆలయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఆదివారం ఒక్క రోజే రూ.కోటికి పైగా రాబడి వచ్చింది. ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 32 వేల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారని అధికారులు భావిస్తున్నారు. ఇక 8,776 రాహు, కేతు పూజలు జరగగా, రూ.50 సర్వదర్శనం 4,109, రూ.200 శీఘ్రదర్శనం 5,769, రూ.500 అంతరాలయ దర్శన టికెట్లు 564 అమ్ముడుపోయాయి. కేవలం ఆర్జిత సేవల ద్వారా రూ.1.02 కోట్ల ఆదాయం రావడం ఇదే ప్రథమమని ఆలయ అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే.

Category

🗞
News
Transcript
00:00Let's do it

Recommended