900 Car Engines Theft at Kia Factory in SathyaSai District : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా పరిశ్రమలో పెద్ద ఎత్తున కారు ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 900 ఇంజిన్లు కనిపించడం లేదంటూ కియా యాజమాన్యం మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొలుత ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేపట్టాలని యాజమాన్యం కోరగా పోలీసులు నిరాకరించారు. ఫిర్యాదు ఇస్తేనే దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు. దీంతో కియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు నియమించారు.
Category
🗞
NewsTranscript
00:00🎵Outro music plays🎵
01:00you