AP Chief Secretary Vijayanand Review on Tenth Exams : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17 (మార్చి 17) నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ అధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Category
🗞
News