తిరుపతిలోని మినర్వా గ్రాండ్ హోటల్‌లో పైకప్పు కూలింది. హోటల్‌లోని గది నంబర్ 314లో పైకప్పు ఒక్కసారిగా కిందపడటంతో భక్తులు భయాందోళనతో పరుగు తీశారు. ఘటనాస్థిలికి చేరుకున్న పోలీసులు భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మినర్వా గ్రాండ్ హోటల్‌ను సీజ్ చేశారు.