Gaddar Awards In Telangana : కళాకారులను, వాగ్గేయకారులను తమ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భక్త రామదాసు జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. గానం అనేది అందరికీ వచ్చే భాగ్యం కాదన్న భట్టి విక్రమార్క మధుర గాయకులుగా ఉన్నందుకు గర్వపడాలని అన్నారు. ఉగాదికి గద్దర్ పేరిట ప్రభుత్వం సినీ కళాకారులకు ఇవ్వాలని సంకల్పించిదని ఆయన గుర్తు చేశారు. అనంతరం తెలంగాణ సంగీత నాటక అకాడమీ వారు ఉపముఖ్యమంత్రి సహా మంత్రులను సన్మానించారు.
Category
🗞
News