Skip to playerSkip to main contentSkip to footer
  • 2/21/2025
CM Revanth Reddy Tour : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇవాళ వికారాబాద్​, నారాయణపేట పర్యటనకు వెళ్లిన సీఎం, అప్పకపల్లెలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనులు ప్రారంభించారు. అప్పక్ పల్లిలో బంగలి దేవమ్మ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, సీఎం సలహాదారు వెం నరేందర్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతకుముందు అప్పకపల్లెలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంకు ప్రారంభించారు. అనంతరం అక్కడి మహిళలతో సీఎం, మంత్రులు ముచ్చటించారు.

Category

🗞
News

Recommended