• 2 days ago
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి భారీ ప్రమాదం తప్పింది.  ఆయన కారును వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. సౌరవ్ గంగూలీ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బుర్ద్వాన్‌ విశ్వవిద్యాలయంలో నిర్వహించే కార్యక్రమానికి వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. 
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న వాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదు. గంగూలీ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఆయన వెళ్తున్న కాన్వాయ్‌లో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి.  

Category

🗞
News

Recommended