Peddagattu Jathara Traffic in Suryapet District : సూర్యాపేట జిల్లా పెద్దగట్టు (గొల్లగట్టు) దురాజ్‌పల్లి లింగ మంతుల స్వామి జాతరకు రెండో రోజు జనాలు పోటెత్తారు. దీంతో కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడ నుంచి భారీగా భక్తుల తాకిడి తీవ్రంగా పెరిగింది. భారీగా భక్తులు తరలిరావడంతో దాదాపు 2 కిలో మీటర్ల మేర రాకపోకలు నిలిచాయి. స్వామి వారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దర్శించుకున్నారు. రెండు సంవత్సరాలకు ఒక సారి వచ్చే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.
Category
🗞
News