‘పుష్ప’తో అల్లు అర్జున్ (Allu Arjun) సరిహద్దులను చెరిపేశారని నటి రష్మిక (Rashmika Mandanna) అన్నారు. ‘పుష్ప2’ (Pushpa 2)తో బన్నీ, సుకుమార్ ప్రపంచవ్యాప్తంగా చాలా రికార్డులను బద్దలు కొడతారని ఆకాంక్షించారు. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప 2’ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మాట్లాడారు. ‘‘పుష్ప 1’ చేసేటప్పుడు నా మైండ్‌లో ఓ ఆలోచన ఉండిపోయింది. ‘పుష్ప 2’లో అదిరిపోయేలా చేయాలనుకున్నా. నా శ్రమంతా పెట్టి ఈ మూవీ చేశా. సుకుమార్, అల్లు అర్జున్‌లపై పూర్తి విశ్వాసం ఉంచి, నటించా. సుకుమార్ కాంబినేషన్‌లో మరో అవకాశం దొరికితే కుమ్మేస్తా. ఆయన నిజంగా బెస్ట్’’ అని రష్మిక పేర్కొన్నారు.
Category
😹
Fun