• 2 months ago
Prahallada Darshan Restricted In Kadiri Temple : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆలయంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలోని భక్తులకు ఆరాధ్య దైవం. ఈ ఆలయంలో అనేక మంది ముస్లింలు కూడా మొక్కులు తీర్చుకోడానికి దర్శనానికి వస్తుండటం విశేషం. ఈ ఆలయం గర్బగుడిలో ఓ వైపు నరసింహస్వామిని, మరోవైపు ప్రహల్లాదుడిని ప్రతిష్టించారు. ఆలయానికి వెళ్లిన వారు ప్రహ్లాద సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే కరోనా అనంతరం ఆలయ అధికారులు గర్భగుడి రెండో తలుపు వెలపలే భక్తులను తిరిగి పంపించేలా దూరదర్శనం ఏర్పాటు చేశారు. దీనివల్ల మూలవిరాట్ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం పక్కనే ఉన్న ప్రహ్లాదుడి విగ్రహం భక్తులకు కనిపించడంలేదు. ప్రహ్లాద సమేతంగా స్వామి దర్శనం లభించకపోవడంతో కదిరి ఆలయానికి వచ్చిన భక్తులు అసంతృప్తిగా తిరిగివెళ్లాల్సి వస్తోంది.

Category

🗞
News
Transcript
00:00.
00:30.
01:00.
01:30.
02:00.

Recommended