• 4 years ago
Former Pak leg-spinner Danish Kaneria has slammed his comparison and former pacer, Mohammad Amir, for his recent statements on the Indian superstar duo of Rohit Sharma and Virat Kohli.
#MohammadAmir
#RohitSharma
#DanishKaneria
#ViratKohli
#pakformerpacerMohammadAmir
#IPL2021
#INDVSENG

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను తక్కువ చేసి మాట్లాడిన పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ హైక్లాస్ బ్యాట్స్‌మన్ అని, అతను నీకంటే సీనియర్ అనే విషయం మర్చిపోవద్దంటూ చురకలంటించాడు. గతేడాది డిసెంబరులో పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ తనని వేధిస్తోందని బాధపడినమహ్మద్ అమీర్.. అనూహ్యంగా 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంటున్న అమీర్.. బ్రిటీష్ సిటిజన్‌షిప్ తీసుకుని ఐపీఎల్‌లో ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమీర్.. రోహిత్ శర్మని తాను సులువుగా ఔట్ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.

Category

🥇
Sports

Recommended