Skip to playerSkip to main contentSkip to footer
  • 2/20/2019
In the early elections of Telangana, Mahakuthami seems to be losing over the alliance. That's why the tdp and congress were both national level alliance and in the locally hope that they would move forward neutrally.
#Chandrababu
#rahulgandhi
#congressthirupathimeeting
#tdp
#congress
#chittor
#andhrapradesh
#Apelections2019

ఏపీ రాజ‌కీయాలు ఎప్పుడూ ఆస‌క్తిక‌రంగా సాగుతాయి. ఒక సంఘ‌ట‌న త‌ర్వాత మ‌రో సంఘ‌ట‌న‌తో ఉత్సుక‌త‌ను రేకెత్తిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు జాతీయ స్థాయిలో ఉంటుంది త‌ప్ప ప్రాంతీయంగా పెద్ద‌గా ఉండ‌ద‌ని తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల త‌ర్వాత ఆ రెండు పార్టీలు ప‌ర‌స్ప‌రం ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చాయి. ఇందులో భాగంగా ఢిల్లీలో చంద్ర‌బాబు ధీక్ష చేసిన‌ప‌ప్పుడు రాహుల్ గాంధీ స్వ‌యంగా దీక్ష‌లో పాల్గొని బాబు- రాహుల్ బందం ఎంత ద్రుఢ‌మైందో చెప్పెక‌నే చెప్పారు. ఇక ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీ తిరుప‌తిలో త‌ల‌పెట్టిన బ‌హిరంగ స‌భ‌కు రాహుల్ గాంధీ ముఖ్య అతిదిగా హాజ‌రౌతున్నారు. మ‌రీ ఎఐసీసీ అద్య‌క్ష హోదాలో తిరుప‌తి స‌భ‌లో అడుగు పెడుతున్న రాహుల్ స‌భ‌లో చంద్ర‌బాబు పాల్గొనే అంశం ఆస‌క్తిగా మారింది. కాంగ్రెస్, టీడిపి రెండు పార్టీల టార్గెట్ ప్ర‌త్యేక హోదా సాధ‌నే కాబ‌ట్టి, ఇదే అంశం పై భ‌రోసా ఇచ్చేందుకు ఏపి వ‌స్తున్న రాహుల్ స‌భ‌లో బాబు పాల్గొనే అంశంపై టీడిపి లో ఉంకా స్ప‌ష్ట‌త రాలేదు.
ఏపీలో టీడీపీ, కాంగ్రెస్‌ల‌ది వింత ప‌రిస్థ‌తి. తాము మిత్రుల‌మా, లేక ప్ర‌త్య‌ర్థుల‌మా అనే సందిగ్ధ‌త‌లో కొట్టుమిట్టాడుతున్న‌ట్లు తెలుస్తోంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల వేళ క‌ల‌సిన చంద్ర‌బాబు, రాహుల్ క‌ల‌యిక.. ఇటీవ‌ల ధ‌ర్మ‌పోరాట‌ దీక్ష‌తో తారాస్థాయికి చేరింది. ఈ మ‌ధ్య‌లో తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో మ‌హాకూట‌మి చిత్తుగా ఓడి పోవ‌డంతో పొత్తు పై ఆచి తూచి అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే.. సైకిల్‌, హ‌స్తం రెండూ జాతీయ స్థాయిలో మిత్రులుగా ఉంటూనే ప్రాతీయంగా మాత్రం ఎలాంటి పొత్తులు లేకుండా ముందుకు వెళ్దామ‌నే ఆలోచ‌న‌లో ఉన్నాయి.
ఏపీలో హ‌స్తం, టీడీపీ క‌ల‌యిక‌పై ఇప్ప‌టికీ అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి. ఎందుకంటే, పీసీసీ అధ్య‌క్షుడు ఎన్. ర‌ఘువీరారెడ్డి దీన్ని మొద‌టి నుంచి వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు. టీడీపీలోనూ మంత్రులు సీహెచ్. అయ్య‌న్న‌పాత్రుడు, కేఈ.కృష్ణ‌మూర్తి ఇద్ద‌రూ పొత్తు మంచిది కాదంటూ కొట్టిపారేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 22న తిరుప‌తిలో నిర్వ‌హించే కాంగ్రెస్ స‌భ‌కు చంద్ర‌బాబు వెళ‌తారా అనే అశంపై ఇంత‌వ‌ర‌కూ స్ప‌ష్ట‌త రాలేదు. జాతీయ స్థాయిలో బాబు, రాహుల్ మ‌ద్య మంచి స‌యోద్య కుదిరిన నేప‌థ్యంలో రాహుల్ ఏపి ప‌ర్య‌ట‌న ప‌ట్ల బాబు ఎలా స్పందిస్తార‌నేది ఉత్కంఠ‌గా మారింది.

Category

🗞
News

Recommended