Skip to playerSkip to main contentSkip to footer
  • 2/5/2019
Hero Ram gift to Puri Jagannadh most expensive coffee in the world
#kopiluwakcoffee
#HeroRam
#PuriJagannadh
#ismartshankar
#expensivecoffeeintheworld

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా రోజులుగా పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఇటీవల పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా పూరి జగన్నాథ్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. నా హీరో రామ్ నాకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని గురించి గూగుల్ లో తెలుసుకోండి. పిచ్చెక్కిపోతారు అంటూ ట్వీట్ చేశాడు.

సాధారణంగా కాఫీ గింజల క్వాలిటీ, కంపెనీ బ్రాండ్ ని బట్టి, కాఫీ రుచిని బట్టి కాఫీ పొడి తయారు చేసే సంస్థలకు మంచి గుర్తింపు లభిస్తూఉంటుంది. కానీ హీరో రామ్ పూరిజగన్నాథ్ కు గిఫ్ట్ గా ఇచ్చిన కాఫీ గురించి తెలిస్తే విదేశాల్లో ఈ కాఫీఎందుకు ఇంతలా గుర్తింపు తెచ్చుకుందో అర్థం అవుతుంది. రామ్ పూరికి కోపి లువాక్ కాఫీ పొడిని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ కాఫీ పొడిని నక్కల నుంచి తయారు చేస్తారు. అక్కడితోనే అవాక్కైపోకండి.. ఇంకా చాలా విషయం ఉంది.

Category

People

Recommended