Skip to playerSkip to main contentSkip to footer
  • 1/3/2019
మేఘాలయలోని మైన్స్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వారు ఇరవై రోజుల క్రితం అందులో చిక్కుకున్నారు. వారిని బయటకు తెచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు గనిలో చిక్కుకున్న కార్మికులను కాపాడే విషయమై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీం కోర్టు గురువారం స్పందించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి సెకండ్ లెక్కకు వస్తుందని, గనిలో చిక్కుకున్న వారి ప్రాణాలతో ఉన్నా, లేకున్నా సరే వారిని బయటకు తేవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ కార్మికులు ప్రాణాలతో బయటపడాలని న్యాయస్థానం ప్రార్థించింది.

Category

🗞
News

Recommended