ఒక వారసుడి ప్రకటనతో కర్నూలు జిల్లా రాజకీయాల్లో కలకలం రేగింది. నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సోదరుడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైసిపిలో చేరనుండటమే ఈ కలకలానికి కారణం. ఇందుకు ముహూర్తం కూడా ఖారారైంది. ఈనెల 7న పార్టీ అధినేత జగన్ సమక్షంలో సిద్దార్ధ రెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. ఈ విషయమై సిద్దార్థ రెడ్డి కూడా నిర్థారించారు. అయితే జగన్ అంటేనే మండిపడే బైరెడ్డి కుటుంబం నుంచి సిద్దార్థరెడ్డి వైసీపీ వైపు వెళ్లడం కర్నూలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితిపై బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.
Kurnool:Former MLA of Nandikothkur, Byreddy Rajeshekhar Reddy brother's son Byrdeddy Siddharth Reddy decided to join in YCP...This decesion has created a sensation in Kurnool district politics.
Kurnool:Former MLA of Nandikothkur, Byreddy Rajeshekhar Reddy brother's son Byrdeddy Siddharth Reddy decided to join in YCP...This decesion has created a sensation in Kurnool district politics.
Category
🗞
News