చికాగో సెక్స్ రాకెట్.. తెలుగు చిత్ర పరిశ్రమని విమర్శలగు గురిచేసిన మరో ఉందంతం ఇది. హీరోయిన్లని ట్రాప్ లోకి దించి వారి చేత వ్యభిచారం చేయించిన కేసులో కిషన్, చంద్రకళ దంపతులని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్వారా ఈ వ్యవహారంలో మొత్తం కూపీ లాగే ప్రయత్నం అమెరికా పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే పలు సంచలన విషయాలని అమెరికా పోలీసులు వెలుగులోకి తీశారు. తాజగా కిషన్ బ్యాంక్ అకౌంట్ ని పరిశీలించిన యుఎస్ అధికారులకు కళ్ళు చెదిరే వాస్తవాలు ఎదురయ్యాయి.
కిషన్, చంద్ర ఇద్దరి బ్యాంకు ఖాతాలని పోలీసులు పరిశీలించారు. భారీ మొత్తంలో వారి ఖాతాల్లో డబ్బు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కిషన్, చంద్ర దంపతుల లావేదేవిలని పరిశీలించగా పోలీసులకు కళ్ళు చెదిరే వాస్తవాలు ఎదురయ్యాయి.
ఇటీవల కాలంలో 30 మంది తెలుగు ప్రముఖులు కిషన్ బ్యాంకు ఖాతాలోకి డబ్బు జమచేసినట్లు తెలుస్తోంది. ఇంత మొత్తంలో వారు ఎందుకు డబ్బు వేశారు. వారితో ఉన్నా సంబంధం ఏమిటి అని పోలీసులు కిషన్ దంపతులని ఇంటరాగేట్ చేస్తున్నారు.
30 మంది వివరాలని సేకరించే పనిలో అమెరికా అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. వీరికి సెక్స్ రాకెట్ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
Category
🎥
Short film