• 6 years ago
This is a ranking of the highest grossing Indian films which includes films from various languages based on the conservative global box office estimates as reported by reputable sources

ఇండియన్ సినీ పరిశ్రమలో రూ. 1000 కోట్ల కలెక్షన్ మార్కు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు దంగల్', 'బాహుబలి' చిత్రాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఇక రూ. 500 మార్కు అందుకున్న చిత్రాలు ఇప్పటి వరకు 8 మాత్రమే ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులో మరొక చిత్రం చేరింది. జైరా వాసిమ్ ప్రధాన పాత్రలో, అమీర్ ఖాన్ కీలకమైన పాత్రలో నటించిన 'సీక్రెట్ సూపర్ స్టార్' చిత్రం తాజాగా రూ. 500 మార్కును అందుకుంది. ఇండియన్ సినీ చరిత్రలో రూ. 500 కోట్ల మార్కును అందుకున్న చిత్రాలు, ఓవరాల్ వసూళ్లపై ఓ లుక్కేద్దాం
అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్' చిత్రం ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా ఉంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 2122.3 కోట్లు వసూలు చేసింది.
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బాహుబలి-2' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1,708.49 వసూలు చేసింది. ఇండియాలో రూ. 1000 కోట్ల మార్కును అందుకున్న తొలి చిత్రం కూడా ఇదే.
ఇండియన్ సినిమా చరిత్రలో రూ. 500 కోట్ల మార్కును దాటిన చిత్రంల్లో అమీర్ ఖాన్ ‘పికె' ఒకటి. ఇక ఓవరాల్ వసూళ్ల పరంగా ఈ చిత్రం రూ. 854 కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో ఉంది.
బాహుబలి- ది బిగినింగ్ చిత్రం ఓవరాల్ వసూళ్ల పరంగా 4వ స్థానంలో ఉంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 650 కోట్లు వసూలు చేసింది.
సల్మాన్ ఖాన్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘భజరంగీ భాయి జాన్' చిత్రం వరల్డ్ వైడ్ రూ. 630.86 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్ వసూళ్ల పరంగా ఈ చిత్రం టాప్-5లో ఉంది.

Recommended