Skip to playerSkip to main contentSkip to footer
  • 1/26/2018
While Ram Gopal Varma’s Gst is named as Gents, ST and it talks about the philosophical treatise of Male Palakova. This philosophical treatise of Male Palakova is directed by Surya Akondi.

రాంగోపాల్ వర్మ పుణ్యమాని ఇండియన్ సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. చాలామందికి ఇది చెత్తగానూ అనిపించవచ్చు. తొంభైల్లో ఆయన తెరకెక్కించిన కథలు ఎంతమందిని ఆశ్చర్యానికి గురిచేశాయో.. ఇప్పుడు కూడా అంతే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కాకపోతే.. కథల్ని పక్కనపెట్టి 'బోల్డ్‌నెస్' పైనే ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారాయన. ఇందుకోసం ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్స్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడాయన 'జీఎస్‌టీ'ని స్ఫూర్తిగా తీసుకుని, 'జీఎస్‌టీ'తోనే కౌంటర్ ఇవ్వబోతున్నాడు మరో దర్శకుడు.. ఇంతకీ ఏంటీ కొత్త 'జీఎస్‌టీ'..అంటే..
వర్మ గాడ్ సెక్స్&ట్రూత్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారో లేక.. ఆయనకు కౌంటర్‌గా తీస్తున్నారో తెలియదు గానీ మొత్తానికి 'జెంట్స్,సెక్స్&ట్రూత్'(జీఎస్‌టీ) అనే మరో సినిమా కూడా మొదలైపోయింది. ఇప్పుడీ 'జీఎస్‌టీ'కి సంబంధించిన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
రాంగోపాల్ వర్మ 'జీఎస్‌టీ' పోస్టర్‌కు అచ్చుగుద్దినట్లుగా ఉంది ఈ పోస్టర్. మియా మాల్కోవా స్థానంలో ఓ పురుషుడు, రాంగోపాల్ వర్మ స్థానంలో వేరే దర్శకుడు ఉన్నారంతే. మిగతాదంతా సేమ్ టూ సేమ్ అనేలా ఉంది. ఇంతకీ ఈ కొత్త దర్శకుడు ఎవరంటే.. 'సూర్య ఆకొండి'.
రాంగోపాల్ వర్మ 'జీఎస్‌టీ'లో మియా మాల్కోవా నటిస్తే.. సూర్య ఆకొండి 'జీఎస్‌టీ'లో మేల్ పాలకోవా నటిస్తున్నాడు. ఏంటీ 'మేల్ పాలకోవా' అనుకుంటున్నారా?.. ఇది మాత్రం కచ్చితంగా వర్మ 'జీఎస్‌టీ' బ్యూటీకి కౌంటర్ అనే అనుకోవాలేమో!

Recommended