Skip to playerSkip to main contentSkip to footer
  • 11/3/2017
The Archaeological Survey of India (ASI) has finally given into the requests of archaeologists and local historians given permission to excavate the site of the Lakshagriha or the House of Lac, which has been featured in the Mahabahrata.
మహాభారతంలో లక్క గృహం అంశం కీలక ఘట్టమే. పాండవులను సజీవ దహనం చేయాలన్న కుట్రతో కౌరవులు లక్క ఇంటిని నిర్మించడం... దాన్నుంచి సొరంగమార్గం ద్వారా పాండవులు తప్పించుకోవడం.. ఇదంతా తెలిసిన విషయమే. అయితే, ఇల్లు దేశంలో ఏ ప్రాంతంలో ఉండేదనేది మరింత ఆసక్తికరం. దీనిపై ఏళ్ల తరబడి పురావస్తు నిపుణులు, చరిత్రకారులు చెబుతున్న అనేక అంశాల ఆధారంగా 'చరిత్ర'ను వెలికితీసేందుకు భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తవ్వకాలు ప్రారంభిస్తే చారిత్రక వాస్తవాలెన్నో వెలుగు చూస్తాయని అంచనా వేస్తున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌ బాగ్‌పట్‌లోని బర్నావాలోనే లక్క ఇల్లు, సొరంగమార్గం ఉన్నట్లు భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ తవ్వకాలకు ఆమోదించింది. ఈ ప్రాంతంలోనే లక్కఇంటి సన్నివేశానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించడంతో ఏఎస్‌ఐ కీలక నిర్ణయం తీసుకుంది. విస్తృత అధ్యయనం అనంతరం ఢిల్లీ ఎర్రకోటలోని పురావస్తు సంస్థ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కియాలజీ) పాటు తమ శాఖకు తవ్వకాలకు గాను అనుమతిచ్చినట్లు ఏఎస్‌ఐ డైరెక్టర్‌ వెల్లడించారు

Category

🗞
News

Recommended