Skip to main contentSkip to footer
  • 8/11/2017
TELUGU GAZALS_DR.C.NARAYANA REDDY_3. Naa_Hrudayamu_Chalincha_Pogaane
నా హృదయం చలించి పోగానే
నడకలు నేర్చుకుంది ఆకాశం
నా నయనం భ్రమించి పోగానే
నవ్వులు రాల్చుకుంది మధుమాసం

తనలో తాను నీడ చూసుకొని
తననే తడిపి ఆరవేసుకోని
ఎదలో తనకు చోటు చాలదని
పెదవిని చేరుకుంది దరహాసం (నా హృదయం)
వీచే గాలి పిలుపు గమనించి ...
పూచే నేలేరుపు పరికించి
పెదవుల బాసలింక చాలునని
పిడికిలి కోరుకుంది ఆవేశం (నా హృదయం )
బ్రతుకే ఆటలగ భావించి.
పగలే కాగడాలు వెలిగించి
ఆఖరి జాములోన చితిలోన
అత్రువులేరుతోది పరిహాసం (నా హృదయం )
ఎదురుగ ఎండమావి రమ్మన్నా
ఇదిగో చేదబావి అంటున్నా
కదలని ఓ సినారే నిను చూసి
కాలం మార్చుకుంది తనవేశం (నా హృదయం )

Category

🎵
Music

Recommended